Wednesday, April 24, 2024

అందుకు గర్వపడుతున్నా: బాబర్ ఆజామ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని, అతనితో తనను పోల్చుతున్నందుకు గర్వపడుతున్నానని పాక్ ఆటగాడు బాబర్ ఆజామ్ అన్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో కోహ్లీని బాబర్ దాటేసి అగ్ర స్థానం దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీతో పోలిక గురించి బాబర్ స్పందించాడు. 

`విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. ప్రతి దేశంలో, పెద్ద మ్యాచ్‌ల్లో అతను నిరూపించుకున్నాడు. నన్ను ఎవరైనా కోహ్లీతో పోలిస్తే ఒత్తిడికి గురవ్వను. అలాంటి ఆటగాడితో పోలుస్తున్నందుకు గర్వపడతా. అయితే కోహ్లీ, నేను భిన్నమైన ఆటగాళ్లం. ఎవరి ఆటతీరు వారిది. ఏదేమైనా కోహ్లీలా ఆడాలన్నదే నా లక్ష్యం. నా జట్టు విజయాలకు సాయపడాలి. నన్ను చూసి దేశం గర్వించాల`ని బాబర్ అన్నాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement