Tuesday, April 23, 2024

ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నీ.. సానియా, బోపన్న జోడీ ఔట్‌.. మిక్స్ డ్‌ డబుల్స్ పైనే ఆశలు

ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నీ నుంచి పురుషుల, మహిళల డబుల్స్‌లో రోహన్‌ బోపన్నతో పాటు సానియా మిర్జా జోడీ వైదొలిగింది. తొలి రౌండ్‌లోనే వీరిద్దరూ ఓటమి చవిచూశారు. రోహన్‌ బోపన్న, ఫ్రెంచ్‌ ఆటగాడు ఎడౌర్డ్‌ రోజర్‌-వెస్సెలిన్‌ జోడీ వరుసగా మూడు సెట్స్‌లో ఓడిపోయింది. వైల్డ్‌ కార్డ్‌ జోడీ క్రిస్టోఫర్‌ రుంగ్‌కట్‌, ట్రీట్‌ హ్యూయ్‌ జోడీ.. బోపన్న ద్వయంపై 6-3, 6-7(3), 2-6 పాయింట్ల తేడాతో ఓడిపోయారు.

గంట 48 నిమిషాల పాటు మ్యాచ్‌ కొనసాగింది. డబుల్స్‌లో ఉక్రెయిన్‌ ప్లేయర్‌ నదియా కిచ్నోక్‌తో జోడీ కట్టిన సానియాకు చుక్కెదురైంది. తొలి రౌండ్‌లోనే స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్‌సెక్‌-కాజా జువాన్‌ జోడీ 4-6, 6-7 (5) చేతిలో సానియా జోడీ ఓటమిపాలైంది. 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ గట్టిగానే పోటీ ఇచ్చినా.. ఓటమి తప్పలేదు. అయితే మిక్స్‌ డబుల్స్‌ విభాగంలో బోపన్న, సానియా మీర్జాల జోడీలు ఇంకా టోర్నీలో సజీవంగానే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement