Friday, March 29, 2024

Breaking: శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఆసిస్​ విజయం.. దంచికొట్టిన స్టోయినిస్​

శ్రీలంకతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు తొలుత శుభారంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (11) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. మిచెల్ మార్ష్ (18) గేరు మార్చే క్రమంలో అవుటయ్యాడు. ఇట్లాంటి సమయంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23), మిచ్చెల్​ మార్ష్​ (18) పరుగులకే అవుటయ్యారు.

అయితే నెమ్మదిగా ఆడినా జట్టును విజయపథానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు కెప్టెన్​ ఆరాన్​ ఫించ్​ (31).. ఇక మూడు వికెట్లు పడిపోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్​ స్టోయినిస్​ ఎదురుదాడికి దిగి 18 బంతుల్లోనే 59 పరుగులు చేసి ఆసిస్​ విజయంలో కీలకంగా మారాడు. దీంతో శ్రీలంక 16.3 ఓవర్లలోనే ఓటమిచెందింది. ఆసిస్​ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement