Sunday, April 14, 2024

శ్రీలంక నుంచి యుఏఈకి మారిన ఆసియాకప్‌ టోర్ని

ఆసియాకప్‌ ఆగస్టు 27 నుండి సెప్టెంబర్‌ 11 వరకు జరుగనుంది. శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో లంక ప్రీమియర్‌లీగ్‌( ఎల్‌ పిఎల్‌) మూడో ఎడిషన్‌ వాయిదా వేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్ర స్తుతమున్న పరిస్థితులలో శ్రీలంక నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు వేదికను మార్చారు. ఈ ఏడాది ఎడిషన్‌లో భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ , అప్ఘని స్తాన్‌ సహా ఆరు జట్లు పోటీ పడనున్నాయి. యుఎఇ, కువైట్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ జట్లు ఆరోస్థానానికి క్వాలిఫయర్‌లో తలపడనున్నాయి. 2016 మాదిరిటి-20 ఫార్మాట్‌లో జరగనున్న ఆసియాకప్‌ టోర్నీలో ఈ సారి మొత్తం 6 జట్లు మెయిన్‌ ఈవెంట్‌లో తలపడనున్నాయి. ఒక్కో గ్రూప్‌లో మూడు జట్లతో రెండు గ్రూపులుంటాయి. గ్రూప్‌ ఎలో ఇండియా, పాకిస్తాన్‌తో పాటు మరో క్వాలిఫయర్‌ జట్టు వచ్చి చేరుతుంది. గ్రూప్‌ బిలో అప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక ఉన్నాయి. లీగ్‌ దశలో ఒక్కో గ్రూప్‌లో ప్రతి జట్టు మిగతా టీంలలో ఒక్కో మ్యాచ్‌ ఆడతాయి. రెండు గ్రూపుల్లో చివరిస్థానాల్లో నిలిచిన జట్టు ఎలిమినేట్‌ అవుతుంది. మిగతా నాలుగు జట్లు సూపర్‌ 4లో తలపడతాయి.

టోర్నీ శ్రీలంక, అప్ఘనిస్తాన్‌ పోరుతో ఆసియాకప్‌ ఆగస్టు 27న ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్‌ తన తొలిమ్యాచ్‌ను ఆగస్టు 28న ఆడనుంది. సెప్టెంబర్‌ 11న ఫైనల్‌ జరగనుంది. శ్రీలంకలో జరగాల్సిన టోర్నీ అక్కడి పరిస్థితుల కారణంగా యుఏఈకి తరలిపోవడం క్రీడాప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్‌ -4లో ప్రతి జట్టు మిగతా టీమ్‌లతో ఒక్కో మ్యాచ్‌ ఆడతాయి. అక్కడ టాప్‌ 2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. అయితే భారత్‌ , పాకిస్తాన్‌ ఫైనల్‌ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఈసారి ఆసియా కప్‌ లో భారత్‌, పాకిస్తాన్‌ జట్లు మూడు సార్లు తలపడే అవకాశముంది. ఆసియాకప్‌ చివరిసారిగా 2018లో యుఎఈలో నిర్వ హించారు. అప్పుడు భారత్‌ విజేతగా నిలిచి ఏడోసారి చాంపియన్‌గా అవతరించింది. ఇదే ఆసియాకప్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతుంది. శ్రీలంక 5 సార్లు విజేతగా నిలిచింది. మరో వైపు పాకిస్తాన్‌ రెండేసార్లు విజేతగా నిలిచింది. అప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ వంటి పసికూనలు కప్పు కొట్టాలని పట్టుదలగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌ మూడుసార్లు ఫైనల్‌కు చేరినా టైటిల్‌ నెగ్గించుకోలేకపోయింది.

స్టార్‌ స్పోర్ట్సుకు ప్రసారహక్కులు..

ఆసియాకప్‌ 2022 ప్రసార హక్కులను స్టార్‌ స్పోర్ట్స్ అండ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ దక్కించుకున్నాయి. ప్రతి మ్యాచ్‌ రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. రోజుకు ఒక్క మ్యాచ్‌ మాత్రమే నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ 11న ఫైనల్‌ నిర్వహిస్తారు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌, కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, దీపక్‌ హుడా, దినేష్‌ కార్తిక్‌, హార్థిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్‌ అశ్విన్‌, యుజువేంద్ర చాహల్‌, రవి బిష్ణోయ్‌, భువనేశ్వర్‌ కుమార్‌,
అర్షిప్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్‌.

- Advertisement -

స్టాండ్‌బై: శ్రేయాస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌.

పాకిస్తాన్‌ జట్టు: బాబర్‌ ఆజం(కెప్టెన్‌) షాదాబ్‌ ఖాన్‌, ఆసిప్‌ అలీ, షఖర్‌ జమాన్‌, హైదర్‌ అలీ, హరీస్‌ రవూఫ్‌, ఇప్తికార్‌ అహ్మద్‌, ఖుష్దిల్‌ షా, మహమ్మద్‌ నవాజ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌, మహమ్మద్‌ వసీం జూనియర్‌, నసీమ్‌ షా, షాహిన్‌ షా అఫ్రిది, షహనవాజ్‌ దహనీ కదిర్‌.

రేప‌టి నుంచి టికెట్ల అమ్మకాలు..

దీంతో ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌ టికెట్‌ అమ్మకాలు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ట్విట్టర్‌లో ప్రకటించింది. ఆసియాకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రీలంక మాజీ అధ్యక్షుడిగా సనత్‌ జయసూర్య ఉన్నాడు. అతడు మొత్తం 1220 పరుగులు చేశాడు. అత్యధిక వికెట్ల వీరుడిగా లంకకే చెందిన దిగ్గజ బౌలర్‌ లసింత్‌ మలింగ ఉన్నాడు. మలింగ మొత్తం టోర్నీలో 33 వికెట్లు తీయడం విశేషం. వన్డే ఫార్మట్‌లో అయితే 2023 ఆసియాకప్‌ టోర్నీ పాకిస్తాన్‌ వేదిక కానుంది.

బంగ్లాదేశ్‌: షకీబ్‌ అల్‌ హసన్‌ (కెప్టెన్‌), అనముల్‌ హక్యు, ముష్ఫిక్యుర్‌, అఫిఫ్‌ హొసేన్‌, మోసదెక్‌ హోసేన్‌, మహముదుల్లా, మహేది హసన్‌, మహమ్మద్‌ సైపుద్దీన్‌ , హసన్‌ మహముద్‌, ముస్తఫిజుర్‌ రహమ్మాన్‌, నసుమ్‌ అహ్మద్‌, షబ్బిర్‌ రహమాన్‌, మెహిది హసన్‌, మిరాజ్‌, ఎడొబట్‌ హోసేన్‌ ఎమొన్‌, నురుల్‌ హసన్‌ సోహన్‌, తస్కిన్‌ అహ్మద్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement