Friday, April 19, 2024

ఖోఖోలో త‌లైవా: అంతర్జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ క్రీడాకారుడు.. ములుగు ఏజెన్సీ నుంచి వ‌చ్చిన‌ ఆణిముత్యం

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలానికి చెందిన క్రీడాకారుడు ఎంపికయ్యాడు. మహారాష్ట్రలోని యవ్వత్ మహల్లో ఈ మ‌ధ్య జరిగిన జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో తెలంగాణ తరపున ఆడి బంగారు పతకాన్ని సాధించాడు. ఖోఖో ఆట‌లో త‌లైవాగా ఈ తెలంగాణ కుర్రాడు రజనీకాంత్ అద్భుత‌ ప్రతిభ కనబరిచాడు. ఇప్పుడు నేపాల్‌లో జ‌రిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు వ‌చ్చే నెల‌ల‌లో నేపాల్‌లో జ‌రిగ‌నున్న‌ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించడంతో అంద‌రూ మెచ్చుకుంటున్నారు.

మూలుగు ఏజెన్సీలోని మారుమూల ప్రాంతం నుంచి ఖోఖో ఆటలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్న ఈ కుర్రాడికి పెద్ద ఎత్తున అభినంద‌న‌లు వ‌స్తున్నాయి. దీంతో అట‌వీ ప్రాంత వాసులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ములుగు ఏజెన్సీలోని కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెనికి చెందిన కావిరి సమ్మయ్య, పద్మ దంపతులకు రెండో కుమారుడు రజినీకాంత్. హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌ చదువుతున్నాడు. కాగా, రజినికాంత్ ను తెలంగాణ స్పోర్ట్స్‌ సెక్రటరీ శ్రీనివాస్, ఖోఖో కోచ్ రబ్బాని అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement