Sunday, October 13, 2024

ODI | ఆఫ్ఘన్ సంచలనం… సౌతాఫ్రికాపై సిరీస్ కైవసం !

ఆఫ్ఘనిస్థాన్ జట్టు మరో సంచలన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 177 పరుగుల భారీ తేడాతో… ప్రపంచ నంబర్ 3 ర్యాంక్‌ర్ దక్షిణాఫ్రికా ను చిత్తిగా ఓడించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో సఫారీ జట్టుపై తొలిసారిగా ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 311 పరుగులు చేసింది. గుర్బాజ్ (105) శతకంతో చెలరేగాడు. అజ్మతుల్లా (86), రహ్మత్ (50) అర్ధశతకంతో ఆకట్టుకున్నారు. ఎంగిడి, బర్గర్, పీటర్, మార్క్‌రమ్ తలో వికెట్ తీశారు.

అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 34.2 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బవుమా (38) టాప్ స్కోరర్. టోని డిజోర్జి (31), మార్క్‌రమ్ (21), రీజా హెండ్రిక్స్ (17) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. రషీద్ ఖాన్ (5/19) అయిదు వికెట్లు, ఖరోటె (4/26) నాలుగు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement