Thursday, April 25, 2024

ఏబీడి బ్యాక్ ఇన్ బెంగళూరు.. హోటెల్ లో చెక్ ఇన్ అయిన డివిలియర్స్

మాజీ దక్షిణాఫ్రికా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ ఎబి డివిలియర్స్ గురువారం (నవంబర్ 3) బెంగళూరులోని హోటల్‌లో చెక్ ఇన్ అయ్యాడు. తాను బెంగలూరు చేరుకున్నట్టు చేసిన ట్వీట్ అతను మళ్లీ జట్టులోకి రావడంపై అభిమానులకు ఆసక్తిని కలిగించింది. 2020 సీజన్ తర్వాత ఐపీఎల్‌తో సహా అన్ని రకాల క్రికెట్‌లకు డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, అతను ఏదో ఒక పాత్రలో RCBకి తిరిగి వస్తానని చెప్పాడు.

“చాలా సంవత్సరాలలో మొదటిసారి ITC రాయల్ గార్డెనియాకు చెక్ ఇన్ చేసాను! చాలా గొప్ప జ్ఞాపకాలు తిరిగి ప్రవహిస్తున్నాయి. అలాగే టెలీ ఆన్‌లో ఉంది మరియు పాక్/SA గేమ్‌కు సిద్ధంగా ఉంది. గో ప్రోటీయాస్, ” అని ఏబీ డివిలియర్స్ తన ట్విట్టర్‌లో రాశాడు.

Mr 360 మళ్లీ RCBకి తిరిగి వస్తున్నాడా.. తన రిటైర్మెంట్‌పై వెనక్కి తీసుకుంటున్నాడా..అని తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. విరాట్ కోహ్లీ మరియు డివిలియర్స్ ఐపిఎల్‌లో ఆర్‌సిబి తరుపున చాలా సంవత్సరాలు ఆడి.. గొప్ప స్నేహితులు అయ్యారు. జట్టులో డివిలియర్స్‌కు తిరిగి రావడంతో కోహ్లితో మరో సారి జతకట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి డివిలియర్స్ ఏ పాత్రలో కనిపించనున్నాడో ఇంకా తెలియదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement