Thursday, April 18, 2024

1st Test : మొదటి టెస్ట్ లో భారత్ ఘన విజయం

నాగ్‌పూర్‌ వేదికగా భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. ఇంకొక ఇన్నింగ్స్ మిగిలి ఉండగానే భారత్ జట్టు 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్పిన్నర్ల మాయాజాలంతో ఆసీస్ బ్యాటర్లు కుప్పకూలారు. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 400 పరుగులు చేసింది. దీంతో 223 పరుగులు చేయాల్సి ఉండగా.. 91 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు ఆలౌటైంది. దీంతో ఒక ఇన్నింగ్స్ మిగిలి ఉండగానే భారత జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement