Tuesday, March 26, 2024

ఐపీఎల్ అధికారిక భాగస్వామిగా ‘అప్ స్టాక్స్’

ఐపీఎల్ కు కొత్త భాగస్వామి వచ్చింది. డిజిటల్ బ్రోకరేజి సంస్థ ‘అప్ స్టాక్స్’ ఇకపై ఐపీఎల్ కు అధికారిక భాగస్వామిగా వ్యవహరించనుంది. ఐపీఎల్ తో ‘అప్ స్టాక్స్’ ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు  ఐపీఎల్ చైర్మన్ బ్రజేశ్ పటేల్. అప్ స్టాక్స్’ ఎంతో వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ ఫాం అని వెల్లడించారు. ‘అప్ స్టాక్స్’ తో కలిసి ఐపీఎల్ కూడా మరింతగా విస్తరిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఈ భాగస్వామ్యం కొనసాగనుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement