Tuesday, April 16, 2024

బ‌యో బ‌బుల్‌ను వీడిన కివీస్ ఆట‌గాళ్లు..ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్దమైన భారత్..?

ఐసీసీ టెస్ట్ ఛాపింయన్ షిప్ ఫైన‌ల్స్‌కు ముందు వివాదం రాజుకున్న‌ది. న్యూజిలాండ్ జ‌ట్టులోని ఆరుగురు ఆట‌గాళ్లు నిబ‌ధ‌న‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి బ‌యో బ‌బుల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. బోల్ట్ , సౌదీతో పాటు మ‌రో నలుగురు ఆట‌గాళ్లు బయో బబుల్‌ను విచ్ఛిన్నం చేశారన్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. డ‌బ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్ట‌న్ వేదిక‌గా జరుగనున్న‌ది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ఆటగాళ్ళు బయో బబుల్ నిబంధనలను విస్మరించి ఉదయం గోల్ఫ్ ఆడటానికి వెళ్ళారని క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ పేర్కొన్న‌ది.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఇరు జట్లు మంగళవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించాయి. రెండు జట్ల ఆటగాళ్ళు సౌతాంప్టన్‌లోని ఒకే హోటల్‌లో బస చేశారు. అయితే, కొంతమంది దీనిపై భారత జట్టు మేనేజ్‌మెంట్ ఆందోళన వ్య‌క్తం చేస్తున్న‌ది. ఈ విషయం గురించి ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ సిద్ధ‌మైంద‌ని స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఇన్‌సైడ్ స్పోర్ట్స్ పేర్కొన్న‌ది. న్యూజిలాండ్ ఆటగాళ్ళు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్, ఫిజియో టామీ సిమ్సెక్ ఉదయం వేళ‌ గోల్ఫ్ ఆడేందుకు వెళ్ళారని క్రిక్ బ‌జ్ వెబ్‌సైట్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు బ‌యో బ‌బుల్‌ను వీడి బ‌య‌ట‌కు వెళ్లిరావ‌డం ప‌ట్ల భారత జట్టు యాజమాన్యం ఆందోళన చెందుతున్న‌ది. హోటల్, గోల్ఫ్ కోర్సు ఒకే ప్రాంగణంలో ఉన్నందున తమ ఆటగాళ్ళు బయో బబుల్ ప్రోటోకాల్‌ను విచ్ఛిన్నం చేయలేదని న్యూజిలాండ్ జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తున్న‌ది. ఇలాఉండ‌గా, ఫైనల్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల కివీస్ జట్టులో మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్ లేరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement