ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు
సూపర్-12కు అర్హత
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ డేవిడ్ వీస్
షార్జా: టీ20 ప్రపంచకప్ 2021లో గ్రూప్ ఎ క్వాలిఫయర్‌గా నమీబియా సూపర్ 12కు అర్హత సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా 8వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 126 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా 18.3ఓవర్లలో 126పరుగులు చేసి గెలుపొందింది. నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ 53పరుగులతో హాఫ్‌సెంచరీ చేసి అజేయంగా నిలవగా డేవిడ్ వీస్ 14బంతుల్లో ఓ ఫోరు, 2సిక్సర్లతో 28పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఐర్లాండ్‌పై విజయంతో నమీబియా ఏ-2 క్వాలిఫయర్‌గా సూపర్ 12కు అర్హత సాధించింది. ఇప్పటికే ఎ-1గా శ్రీలంక సూపర్12కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 125పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటింగ్‌లో పాల్ స్టిర్లింగ్ 38పరుగులు చేయగా, కెవిన్ ఒబ్రెన్ 25, ఆండ్రూ బాల్బిరిన్ 21పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రింక్స్ 3, డేవిడ్ వీస్ 2వికెట్లు తీశాడు. కాగా నమీబియా టీ20 ప్రపంచకప్‌లో తొలి ప్రయత్నంలోనే సూపర్12కు చేరుకుని రికార్డు సృష్టించింది. స్కాట్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇప్పటికే సూపర్12కు చేరుకోగా తాజాగా నమీబియా వీటి సరసన చేరింది. అండర్‌డాగ్‌గా ప్రవేశించిన నమీబియా మాజీ ఛాంపియన్ శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమితో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అనంతరం నెదర్లాండ్స్‌పై విజయం సాధించి గెలుపుబాట పట్టింది. కీలక మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా మాజీ స్టార్ డేవిడ్ వీస్ నమీబియా విజయంలో కీలక పాత్రతో అలరించాడు. 2019లో నమీబియా టీ20ల్లో అరంగేట్రం చేసింది. 1993లో ఐసీసీ అసోసియేట్ మెంబర్‌గా సభ్యత్వం పొందిన నమీబియా తొలిసారి 2003 వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంది. ఆఫ్రికన్ కంట్రీ నమీబియా టీ20 ప్రపంచకప్ సూపర్ 12అర్హత సాధించేందుకు కేవలం 25టీ20ల్లో మాత్రమే పాల్గొంది.
స్కోరు బోర్డు
ఐర్లాండ్ ఇన్నింగ్స్ … స్టిర్లింగ్ (సి) ఈటన్ (బి) స్కాల్ట్జ్ 38, కెవిన్ (సి) మైకేల్‌వాన్ (బి) జాన్ 25, బాల్బిరినీ (ఎల్బీ0 జాన్ 21, గారెత్ (బి) వీస్ 9, కర్టిస్ కాంఫర్ (బి) జాన్ 4, హారీ టెక్టర్ (సి) జానేగ్రీన్ (బి) వీస్ 8, నీల్ రాక్ (బి) స్మిత్ 5, మార్క్ అడైర్ (రనౌట్) 5, సిమీసింగ్ (నాటౌట్) 5, క్రెగ్‌యంగ్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 4. మొత్తం: 125 (8వికెట్లు. 20ఓవర్లు). వికెట్ల పతనం: 62-1, 67-2, 94-3, 101-4, 104-5, 110-6, 116-7, 121-8. బౌలింగ్: రూబెన్ 3-0-18-0, వీస్ 4-0-22-2, స్మిత్ 4-0-27-1, స్కాల్ట్జ్ 3-0-25-1, జాన్ 4-0-21-3, పిక్కీ 2-0-11-0.
నమీబియా ఇన్నింగ్స్… క్రెగ్ విలియమ్స్ (సి) కెవిన్ (బి) కర్టిస్ 15, జానేగ్రీన్ (సి) కెవిన్ (బి) కర్టిస్ 24, ఎరాస్మస్ (నాటౌట్) 53, వీస్ (నాటౌట్) 28, ఎక్స్‌ట్రాలు 6. మొత్తం: 126(2వికెట్లు. 18.3ఓవర్లు). వికెట్ల పతనం: 25-1, 73-2. బౌలింగ్: లిటిల్ 4-0-22-0, క్రెగ్‌యంగ్ 3.3-0-33-0, అదిర్ 1.4-0-12-0, కర్టిస్ కాంఫర్ 3-0-14-2, కెవిన్ 2.2-0-15-0, సిమీసింగ్ 4-0-28-0.
నమీబియా నయా చరిత్ర

Advertisement
తాజా వార్తలు
Advertisement