- టాలీవుడ్ తర్వాత కన్నడ సినిమాకు దేశవ్యాప్త గుర్తింపు
ఇటీవలి కాలంలో పాన్ ఇండియా ట్రెండ్‌కు దక్షిణ భారత సినిమాలు పెద్ద దూకుడునే అందించాయి. మొదటగా తెలుగు సినిమాలు ‘బాహుబలి’ సిరీస్, ‘పుష్ప’ వంటి బ్లాక్ బస్టర్‌లతో దేశవ్యాప్తంగా విజయాన్ని సాధించగా, ఇప్పుడు అదే దారిని కన్నడ ఇండస్ట్రీ కూడా అనుసరిస్తోంది.
‘కేజీఎఫ్’, ‘కాంతార’, ఇప్పుడు ‘మహావతార్ నరసింహ’ వంటి చిత్రాలు వరుసగా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవుతూ కన్నడ సినిమాను దేశవ్యాప్తంగా నిలబెట్టాయి.
‘కేజీఎఫ్’తో మొదలైన ఈ జోరు, ‘కాంతార’తో కొనసాగింది. ఇప్పుడు ‘మహావతార్ నరసింహ’ కూడా అదే రూట్లో ప్రయాణిస్తోంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ మూడు చిత్రాలు మల్టీ-పార్ట్ (బహుభాగాల) ఫ్రాంచైజీలు. అంటే, వీటి తర్వాతి భాగాలు దేశవ్యాప్తంగా మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇటీవలి దశాబ్దంలో పాన్ ఇండియా సినిమా ట్రెండ్ ఒక నూతన మార్గాన్ని ఏర్పరిచింది. బాహుబలి 2 తర్వాత ఈ ట్రెండ్ గతంలో కంటే బలంగా మారింది. టాలీవుడ్ ఈ మార్గాన్ని ముందుగా దాటి దేశవ్యాప్తంగా తాము తలదన్నే స్థాయికి చేరింది. కానీ తమిళ (కొలీవుడ్), మలయాళ (మొలీవుడ్) సినిమాలు మాత్రం ఇప్పటికీ ఆ స్థాయిలో విస్తరించలేక పోతున్నాయి.
ఈ నేపథ్యంలో ‘శాండల్ వుడ్’గా పిలవబడే కన్నడ సినీ పరిశ్రమ మాత్రం నిలకడగా తన మార్కు పెంచుకుంటోంది. స్టోరీ టెల్లింగ్, కల్చరల్ ప్రెజెంటేషన్, టెక్నికల్ స్టాండర్డ్ అన్నీ కలిసి ప్రాంతీయ సినిమా సరిహద్దులను జాతీయ స్థాయిలో తెరపైకి తీసుకువస్తున్నాయి.