Wednesday, February 8, 2023

కొత్త కొత్త‌గా లావణ్య త్రిపాఠి..

సౌత్ సినిమాలు చూసేవారికి లావణ్య త్రిపాఠి పేరు పరిచయం చేయాల్సిన పనే లేదు. అందాల రాక్షసిగా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి ‘భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా, అర్జున్ సురవరం, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్‌డే లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. లావణ్య త్రిపాఠి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొత్తలో రసగుల్లా లాగా కొంచెం బొద్దుగా ఉండేది. కానీ గ్లామర్ గాలి తగిలితే పూతరేకులా జీరో సైజ్ కు మారి కళాత్మక బుర్ర ఉండే జనాలకు నిద్రలేకుండా చేస్తోంది. ఎలాగూ ఈ తరం భామ కాబట్టి, ఇక హాట్ ఫోటోషూట్లు చెయ్యడం సోషల్ మీడియాలో మంట పెట్టడం అత్యంత సహజం. ఈ బ్యూటీకి ఇన్స్టాలో 3 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో షూట్ తాలూకు ఫోటోలను పోస్ట్ చేసింది. పసుపు లంగా ఓణిలో అలా పడుకున్నట్టు వాలిపోతూ లావణ్య హస్కీ ఫోజులు ఇచ్చింది. పైగా స్లీవ్ లెస్ జాకెట్ ను దరించి చేత్తో అలా సుతారంగా కాలును పట్టుకోవడంతో లావణ్య త్రిపాఠి ఫుల్ హాట్ గా కనిపిస్తోంది. దాంతో ఈ ఫోటోలకు నెటిజన్స్ వరుస లైక్స్ వేసుకుంటున్నారు. లావణ్య త్రిపాఠి పోస్ట్ చేసిన ఈ హాట్ ఫోటోలకు కామెంట్లు కూడా అదిరిపోయాయి. “లావణ్య హాట్.. త్రిపాఠి డబల్ హాట్”.. “హోమ్లీ బ్యూటీ ఆన్ ఫైర్” అంటూ నెటిజన్స్ కామెంట్లు పెట్టారు. మొత్తానికి లావణ్య త్రిపాఠి స్టార్ హీరోయిన్ కాలేకపోయినా ఆ రేంజ్ ఎలివేషన్స్ ను మాత్రం బాగానే ఇస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement