Saturday, January 4, 2025

Triptii Dimri | హ్య‌ట్రిక్ విజ‌యాల ఆనందంలో యానిమ‌ల్ సుంద‌రి..

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్‌’ సినిమాతో తృప్తి డిమ్రి ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యింది. ఆ సినిమాలో రణబీర్‌ కపూర్‌తో చేసిన రొమాంటిక్ సీన్స్‌తో పాటు, నటనతోనూ మెప్పించింది. హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న కంటే తృప్తి డిమ్రికి ఎక్కువ ఫేం దక్కింది.

బాలీవుడ్‌లో ఈ అమ్మడు ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్ జాబితాలో చేరింది. 2023లో యానిమల్‌ సినిమా వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు త్రిప్తి తలుపు తట్టాయి అంటూ బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. యానిమల్‌ వంటి బిగ్గెస్ట్‌ మూవీ తర్వాత చిన్నా చితకా సినిమాలు చేయకూడదు అనే ఉద్దేశ్యంతో వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ని ఓకే అని చెప్పకుండా ఆచితూచి ఎంపిక చేసుకుంటూ నటించింది.

ఈ ఏడాది తృప్తి నుంచి మూడు సినిమాలు వచ్చాయి. బ్యాడ్‌ న్యూస్‌ కి మంచి స్పందన వచ్చింది. భూల్‌ భులయ్యా 3 బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాదిలో మూడు సినిమాలతోనూ మంచి పేరును సొంతం చేసుకోవడంతో పాటు డీసెంట్‌ హిట్‌లను అందుకుంది. అయితే 2024లో ఆమె నటించిన మూడు సినిమాల్లోనూ అందాల ఆరబోతకి పరిమితం అయ్యింది. కాగా, ఇక ఇప్ప‌టికే ఈ బ్యూటీ మ‌రో ఆరు మూవీల‌కు సైన్ చేసింది.. 2025 డైరీ ఇప్ప‌టికే నిండిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement