టాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న నటి మీనాక్షి చౌదరి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అద్భుతమైన ఫొటో డంప్ చేస్తూ అభిమానుల గుండెల్లో మరోసారి సునామీ లేపింది. ప్రస్తుతం జపాన్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ, అక్కడి వీధుల్లోనూ, ఒకినావా బీచ్ ఒడ్డునూ విహరిస్తూ తీసుకున్న స్టన్నింగ్ క్లిక్స్‌తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.

స్క్రీన్‌పై ఎప్పుడూ గ్లామర్ క్వీన్‌గా కనిపించే మీనాక్షి, రియల్ లైఫ్‌లోనూ తన స్టైల్‌తో మాయ చేస్తోంది. క్యాజువల్ లుక్‌లోనూ, ఎథ్నిక్ లుక్‌లోనూ ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

మూవీ కెరీర్‌లో వరుస హిట్స్ కొడుతున్న మీనాక్షి, ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తన మ్యాజిక్ కొనసాగిస్తోంది. తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా ఆమె హీరోయిన్‌లా కనిపిస్తుందని అభిమానులు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

Leave a Reply