Friday, April 26, 2024

కడప జిల్లాలో ఉద్రిక్తత.. బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య కత్తులతో దాడి

కడప జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కత్తులతో దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో బీజేపీకి చెందిన ఆరుగురు, వైసీపీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ ఘర్షణలో గ్రామ వాలంటీర్ వెంకటేష్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది.

ఇటీవల అయ్యవారిపల్లిలో 100 కుటుంబాలు వైసీపీ నుంచి బీజేపీలోకి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ చెలరేగుతోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు ప్రసాద్, గ్రామ వాలంటీర్ వెంకటేష్ మధ్య సంక్షేమ పథకాల విషయంలో గొడవ జరిగింది. దీంతో, బీజేపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement