Sunday, June 4, 2023

YS Sharmila: వనమా రాఘ‌వ కండ్లు పీకేసే ద‌మ్ము కేసీఆర్‌కు ఉందా?

భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యపై తెలంగాణ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ నేతల అరాచ‌కాల‌కు నిండు కుటుంబం బ‌లైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ వనమా రాఘవ ఆగడాలకు వడ్డీ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. త‌న తండ్రి ఎమ్మెల్యే వ‌న‌మా ప్రోద్బ‌లంతోనే ఇలాంటి దారుణాల‌కు ఒడిగట్టాడని ఆరోపించారు. మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షిస్తామని, కండ్లు పీస్తామన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రామకృష్ణ కుటుంబాన్ని వేధించిన వనమా కండ్లను కూడా కేసీఆర్ పీకేస్తారా? అంటూ ప్రశ్నించారు.

‘’ఆడ‌పిల్ల‌ల జోలికొస్తే కండ్లు పీకేస్తాం అన్నారు కేసీఆర్ గారు. మ‌హిళ‌ను వేధించి, నిండు కుటుంబం బ‌లి కావ‌డానికి కార‌ణ‌మైన‌ వ‌న‌మా రాఘ‌వ కండ్లు పీకేసే ద‌మ్ము కేసీఆర్‌కు ఉందా?’’ అని షర్మిల నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement