Sunday, April 14, 2024

HYD: అమీర్పేట్ లో గన్ తో యువకుడి హల్ చల్..

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీర్ పేట్ లో గన్ కలకలం చోటుచేసుకుంది. అమీర్ పేట్ బిగ్ బజార్ వద్ద పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బందికి సాయి కుమార్ అనే వ్యక్తి గన్ తో పట్టుబడ్డాడు. ఆ ప్రాంతంలో పలువురితో గొడవ పడుతుండగా పెట్రోలింగ్ కోసం వెళ్లిన పోలీసులు సాయి కుమార్ వద్ద పిస్టోల్, ఆరు రౌండ్ల లైవ్ బులెట్స్ స్వాధీనం చేసుకున్నారు. సాయి కుమార్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పోలీస్ ల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement