Wednesday, April 24, 2024

Hyd: క్రెడిట్ కార్డు ఏజెంట్ల వేధింపులతో.. యువకుడి ఆత్మహత్య..

క్రెడిట్ కార్డు ఏజెంట్ల వేధింపులతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ లో చోటుచేసుకుంది. క్రెడిట్ కార్డు రికవరీ ఏజెంట్ల వేధింపులతో దత్తాత్రేయ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకొని దత్తాత్రేయ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్లుగా దత్తాత్రేయ ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసయ్యాడు. వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలని తనను వేధిస్తున్నారని సూసైడ్ లెటర్ రాసిపెట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement