Thursday, December 12, 2024

TG | మీ భవిత, మా బాధ్యత… విద్యార్థులతో సీఎం రేవంత్ చిట్ చాట్ !

విద్యార్థులు చదువులో రాణించాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గ‌త పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన విద్యావ్యవస్థలో సమూల మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో డ్రాపౌట్స్ తగ్గించేందుకు యువత కృషి చేయాలని అన్నారు.

ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు డైట్‌, కాస్మెటిక్‌ చార్జీలు పెంచిన నేపథ్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఆధ్వర్యంలో విద్యార్థులు తరలివచ్చి జూబ్లీహిల్స్‌ నివాసంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం రేవంత్ వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. విద్యావ్యవస్థ మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించడం, స్కిల్‌ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు తదితర అంశాలను ప్రస్తావించారు.

డ్రాపౌట్‌లను తగ్గించేందుకు యువజన సంఘాలు చొరవ తీసుకోవాలని.. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల బారిన పడొద్దని కోరారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలను నమ్మవద్దని విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని హితవు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement