Thursday, September 21, 2023

Braking: ఆన్ లైన్ లోన్ నిర్వాహ‌కుల వేధింపుల‌కు యువ‌కుడి బ‌లి

ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు ఓ యువకుడు బ‌లైన ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో చోటుచేసుకుంది. న‌గ‌రంలోని జియాగూడకు చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజ్‌కుమార్ రూ.12 వేల ఆన్‌లైన్ లోన్ తీసుకున్నాడు. ఈఎంఐ ద్వారా రూ.4 వేలు చెల్లించాడు. లోన్ తీసుకునే సమయంలో స్నేహితుల ఫోన్ నంబర్లను రిఫరెన్స్ కాంటాక్ట్స్‌గా ఇచ్చాడు. తీసుకున్న మొత్తం చెల్లించకపోవడంతో రాజ్ కుమార్ స్నేహితులకు లోన్ యాప్ నిర్వహకులు మెసేజ్‌లు చేస్తున్నారు. దీంతో మనస్థాపానికి గురైన రాజ్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement