Tuesday, April 23, 2024

‘చూసి నేర్చుకోకు’ అంటున్న నితిన్

హీరో నితిన్ నటిస్తున్న ‘రంగ్ దే’ సినిమా నుంచి ‘చూసి నేర్చుకోకు’ అంటూ సాగే పాటను తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఫుల్ లిరికల్ వీడియోను ఆదివారం విడుదల చేస్తామని యూనిట్ తెలిపింది. కాగా ఇప్పటికే ‘ఏమిదో ఇది’, ‘బస్టాండే బస్టాండే’, ‘నా కనులు ఎప్పుడూ’అంటూ సాగే పాటలు విడుదల కాగా శ్రోతలను అలరిస్తున్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement