Thursday, April 25, 2024

తెలంగాణాకు ఎల్లో అలెర్ట్‌.. మరో రెండు రోజులపాటు వర్ష సూచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకూ మహారాష్ట్ర మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వచ్చే 24 గంటల్లో ఆదిలాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఇక రానున్న 48 గంటలు రాష్ట్రంలో ఇదే విధమైన వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ములుగుజిల్లా వెంకటాపురంలో 15.6 సెంటిమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement