Sunday, April 11, 2021

ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జ్

రెండు మేజర్ సర్జరీలు చేయించుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి చేరుకున్నారు. గత పది రోజులుగా చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొంది ఆమె శనివారం డిశ్ఛార్జి అయ్యారు. చెన్నైలోని తన నివాసానికి చేరుకున్న రోజా.. ‘నా ఆరోగ్య పరిస్థితి వల్ల విశ్రాంతి తీసుకుంటున్నా. ఆస్పత్రిలో ఉన్నా. ఇంటిలో ఉన్నా నా ఆలోచనంతా వైసీపీ అభ్యర్థుల విజయం మీదే ఉంది’ అని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె భర్త సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకొని సంతోషంగా చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు. కాగా ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు రోజా చెన్నైలోని ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటారని ఆర్కే సెల్వమణి మీడియాకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News