Wednesday, March 27, 2024

రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ గా సుహాస్.. ట్రైల‌ర్ రిలీజ్

కలర్‌ ఫోటో సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్‌ సాధించాడు.. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన రైటర్‌ పద్మభూషణ్‌ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. లేటెస్ట్‌గా రిలీజైన ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. అనగనగా మన విజయవాడ మహా నగరంలో నెలబడ్జెట్‌లో వెయ్యి రూపాయలు మిగిలితే పొంగిపోయే నాన్న, సీరియల్స్‌లో ట్విస్ట్‌లు ముందే కనిపెట్టే అమ్మ, రాబోయే కాలంలో కాబోయే గొప్ప రైటర్‌ను అని ఫీలయ్యే నేను అంటూ సుహాస్ పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. రైటర్‌ కావాలనుకున్న సుహాస్‌ కల కలగానే మిగిలిపోతుందా? సుహాస్‌ లైఫ్‌లో వచ్చే ట్విస్ట్‌ ఏంటి? సుహాస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ తనను ఛీ కొట్టడానికి రీజన్‌ ఏంటి? అనే ఎన్నో ప్రశ్నలు ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి.
హీరోగా..విల‌న్ గా..క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నాడు సుహాస్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement