Thursday, March 28, 2024

కొవాగ్జిన్‌కు WHO క్లియరెన్స్ మరింత ఆలస్యం

కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు ఇప్ప‌ట్లో క‌ష్టాలు తొలిగేలా లేవు. భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌కు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు రావాల్సిన అత్య‌వ‌స‌ర వినియోగ అనుమ‌తి మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కోవాగ్జిన్ టీకాను ఉత్ప‌త్తి చేస్తున్న భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌కు తాజాగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కొన్ని ప్ర‌శ్న‌లు వేసింది. వ్యాక్సిన్‌కు సంబంధించి సాంకేతిక‌ర‌ప‌ర‌మైన అంశాల‌పై భార‌త్ బ‌యోటెక్ నుంచి డ‌బ్ల్యూహెచ్‌వో స‌మాధానాలు ఆశిస్తోంది.

అయితే ఈ జాప్యం వ‌ల్ల భార‌తీయుల‌పై ప్ర‌భావం ప‌డ‌నుంది. ముఖ్యంగా అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు చేసే విద్యార్థుల‌కు మ‌రి కొంత కాలం పాటు నిరీక్ష‌ణ‌ త‌ప్పేలా లేదు. అత్య‌వ‌స‌ర వినియోగ అనుమ‌తి ద‌క్క‌క‌పోవ‌డం వ‌ల్ల అనేక దేశాలు కోవాగ్జిన్ టీకాను గుర్తించ‌డంలేదు. టీకాకు చెందిన అన్ని ర‌కాల డేటాను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు స‌మ‌ర్పించామ‌ని భార‌త్ బ‌యోట‌క్ పేర్కొన్న‌ది. త్వ‌ర‌లోనే కోవాగ్జిన్‌కు డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి వస్తుంద‌ని ఇటీవ‌ల కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి చెప్పిన కొన్ని రోజుల్లోనే డ‌బ్ల్యూహెచ్‌వో వ‌ర్గాల నుంచి ఈ స‌మాచారం అంద‌డం శోచ‌నీయం. కోవాగ్జిన్ మూడ‌వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ డేటా ప్ర‌కారం ఆ వ్యాక్సిన్ 77.8 శాతం సామర్థ్యంతో ప‌నిచేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement