Wednesday, June 16, 2021

సిగ్గుచేటు..కోడలిని రూ. 80 వేలకు అమ్మేసిన మామ!

మహిళలను కొనుగోలు చేసి విక్రయించే ఓ ముఠా ఉత్తరప్రదేశ్ పోలీసులకు చిక్కింది. ఈ ముఠా ఇప్పటి వరకు 300 మంది మహిళలను ఇలా కొనుగోలు చేసి విక్రయించినట్టు తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఓ వ్యక్తి తన కోడలిని ఈ ముఠాకు విక్రయించడం, అది తెలిసి ఆమె భర్త పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బారాబంకీ జిల్లాలోని మల్లాపూర్‌కు చెందిన చంద్రరామ్ గుజరాత్‌కు చెందిన ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని తన కోడలిని రూ. 80 వేలకు విక్రయించాడు. విషయం తెలిసిన బాధితురాలి భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అప్రమత్తమైన పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని బాధితురాలిని ముఠా చెర నుంచి విడిపించి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అరెస్ట్ చేసిన 8 మంది నిందితుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడు, బాధితురాలి మామ చంద్రరామ్‌తోపాటు మరో నిందితుడైన రాము గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితురాలి మామ చంద్రరామ్ ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News