Tuesday, April 23, 2024

రైల్వే స్టేషన్‌లలో చోరీలకు పాల్పడుతున్న మహిళ అరెస్టు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల దృష్టి మరల్చి బంగారు అభరణాలను దొంగలిస్తున్న పాత నేరస్తురాలిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి రూ. 25 లక్షల విలువైన 53 తులాల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే ఎస్పీ అనురాధ మీడియా సమావేశలో తెలిపారు. రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ వద్ద, లిఫ్ట్‌ వద్ద రద్దీ ఉండే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ప్రయాణికుల నుండి బంగారు అభరణాలను అపహరించినట్లు పేర్కొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి మంగనూరు వెళ్లేందుకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఓ మహిళ ప్రయాణికురాలని లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడ్డారు.

కూకట్‌పల్లికి చెందిన ఆరూరి ప్రియ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రయాణికుల హడావుడి గమనించి లిఫ్ట్‌ వద్దకు వచ్చిన వెంటనే సదరు మహిళ ప్రయాణికురాలి బ్యాగ్‌పై తన చీర కొంగును కప్పి ప్రయాణికుల బ్యాగుల జిప్‌లను కత్తిరించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. రైలు ప్రయాణికులు ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులను తమ వెంట తీసుకువచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఎస్‌పీ కోరారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement