Thursday, March 28, 2024

రెస్టారెంట్ బిజినెస్‌పేరుతో దందా.. ఇన్వెస్ట‌ర్స్‌ని మోసగిస్తున్న మ‌హిళ అరెస్టు

హైదరాబాద్, ప్ర‌భ‌న్యూస్: హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రెస్టారెంట్ బిజినెస్ పేరుతో మోసాల‌కు పాల్ప‌డుతున్న ఓ మ‌హిళ య‌వ్వారం ఇవ్వ‌ల వెలుగులోకి వ‌చ్చింది. రెస్టారెంట్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టాల‌ని ఇన్వెస్ట‌ర్ల‌ను కోట్ల రూపాయలకు మోసగించిన తల్లీ కొడుకుల‌ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. కాగా, అరెస్టయిన వ్యక్తులు నాగిళ్ల సుకన్య, ఆమె కుమారుడు నాగిల్ల జెసింత్‌గా తెలిపారు. సుకన్య భర్త నాగిళ్ల రూఫస్ పరారీలో ఉన్నాడు. వారు చాలా సంవత్సరాలుగా చర్చిని నడుపుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో బంజారాహిల్స్‌లోని ఫిల్మ్ నగర్‌లో క్యూబా డ్రైవ్ ఇన్‌ను ప్రారంభించేందుకు ఒక సంస్థను స్థాపించి రెస్టారెంట్ వ్యాపారంలోకి ప్రవేశించారు.

అయితే.. తమ చర్చికి వచ్చే వ్యక్తులను, వారి సర్కిల్‌లోని ఇతరులను.. రెస్టారెంట్ బిజినెస్‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని, అధిక లాభాలు వ‌స్తాయ‌ని న‌మ్మ‌బ‌లుకుతూ కోట్ల‌లో వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. వారి వెంచర్‌లో పెట్టుబడి పెట్టాల‌ని చాలామందిని ఒప్పించారు. 2017 నుంచి 2019 మధ్య కాలంలో దాదాపు 30 మంది నుంచి రూ.13 కోట్ల దాకా ఇట్లా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు అధికారులు తెలిపారు.

కాగా.. వీరి బిజినెస్‌కు క్యాష్ ఇచ్చిన వారు ఆశించిన‌ట్టుగా ఎలాంటి రాబడి లేకపోవ‌డంతో అనుమానం త‌లెత్తింది.. దీంతో త‌మ పెట్టుబ‌డి డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని నాగిళ్ల‌ కుటుంబంపై ఒత్తిడి చేశారు. ఈ క్ర‌మంలో నాగిళ్ల ఫ్యామిలీ రివ‌ర్స్ లో వారే పెట్టుబ‌డుదారుల‌పై బెదిరింపులకు దిగేవార‌ని పొలీసులు పేర్కొన్నారు. ఇదే విదంగా కోటి రూపాయల మోసానికి గురైన ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు చీటింగ్, తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1999 వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇక‌.. ప‌రారిలో ఉన్న నాగిళ్ల‌ రూఫస్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement