Thursday, June 8, 2023

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో – క్లీనర్ మృతి

అద్దంకి (ప్రభ న్యూస్) – మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో వరి పంట కోతలకు వరి కోసే యంత్ర పరికరాలతో తమిళనాడు రాష్ట్రంలోని సేలం నుంచి ఐదుగురు వరి కోత మిషన్ లను అమర్చుకొని లారీలలో వెళుతున్న క్రమంలోమండలంలోని చినకొత్తపల్లి గ్రామ సమీపంలోని నామ్ రోడ్ లో ఈశ్వర్ పెట్రోల్ బంక్ వద్ద విద్యుత్ తీగలు ఒక లారీ పైనున్న వరి కోత మిషన్ కి తగిలి సార్ట్ సర్క్యూట్ కావడంతో లారీ క్లినర్ విద్యుత్ షాక్ గురై అక్కడ కక్కడే మృతి చెందాడు. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రం సీలం నుంచి తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ మరియు పరిసర ప్రాంతాల్లో వరి కోత పనుల నిమిత్తం వరి కోత మిషన్ ను ప్రత్యేక లారీ లో అమర్చి 5 మంది తరలి వెళుతున్న క్రమంలో మండలంలోని చినకొత్తపల్లి గ్రామం సమీపంలోని నామ్ రోడ్ లో ఈశ్వర్ పెట్రోల్ బంక్ వద్ద విద్యుత్ తీగలు వరికోత యంత్ర పరికరానికి తగిలి సార్ట్ సర్క్యూట్ కావడంతో తమిళనాడు రాష్ట్రం తెంగాఫీ జిల్లా కె అలాంగుల గ్రామానికి 48 సం.ల లారీ క్లినర్ సల్లాఛ్చన్ అక్కడి కక్కడే మృతి చెందారు. మిలిగిన 4 గురి కి స్వల్ప గాయాలు అయ్యాయి.సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిసీలించి మృతి చెందిన సల్లాఛ్చన్ మృత దేహాన్ని పోస్టు మార్టు నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి డ్రైవర్ యువరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement