Monday, April 15, 2024

ఈ సవాల్ ని నువ్వు అధిగమిస్తావ్.. సమంత ఆరోగ్యంపై స్పందించిన చిరంజీవి

స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. దాంతో మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.. సమంత నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ సందేశం వెలువరించారు. డియర్ సామ్… అంటూ చిరు ట్వీట్ చేశారు. మన జీవితాల్లో ఎప్పటికప్పుడు సవాళ్లు ఎదురవుతుంటాయి. బహుశా మనలోని సత్తాని వెలికితీయడానికి ఇలాంటి సవాళ్లు ఉపకరిస్తుంటాయి. నువ్వు ఎంతో ఆత్మస్థైర్యం ఉన్న అద్భుతమైన అమ్మాయివి. ఈ సవాల్ ను కూడా నువ్వు అధిగమించగలవని నేను కచ్చితంగా చెప్పగలను. త్వరలోనే నువ్వు మామూలు మనిషివి అవుతాయి. ఈ కష్ట సమయంలో నీకు ధైర్యం, దృఢవిశ్వాసం కలగాలని కోరుకుంటున్నాను. ఆ దైవశక్తి కూడా నీ వెన్నంటే ఉంటుందని ఆశిస్తున్నానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement