Friday, December 6, 2024

AP-TG : సీఎం రేవంత్ కు.. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల‌ విషెస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీతో పాటు అనేకమంది మంత్రులు, నాయకులు సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డిని విష్ చేయగా.. కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ”గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తున్నాను” అంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ”సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యం, దీర్ఘాయువుతో తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చే శక్తి పొందాలని అభిలాషిస్తున్నాను” అంటూ పవన్ కల్యాణ్ కూడా ట్వీట్ చేశారు. కాగా.. తెలంగాణ సీఎంగా ఇది రేవంత్ రెడ్డికి తొలి పుట్టినరోజు కావడంతో పార్టీ కేడర్ మొత్తం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే ఆయన యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మూసీ పొడవునా పాదయాత్రకు సిద్ధమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement