Thursday, April 25, 2024

450 మంది ఫ్రెషర్లపై విప్రో వేటు

ప్రముక ఐటీ కంపెనీ విప్రో ఫ్రెషర్లపై వేటు వేసింది. పనితీరు సరిగా లేదన్న కారణంతో 452 మందిని తొలగించింది. శిక్షణ తరువాత కూడా పనితీరు మెరగుపరుచుకోవడంలో విఫలమైందును వీరికి ఇంటికి పంపిస్తున్నట్లు తెలిపింది. పనితీరు విషయంలో విప్రో ఉన్నత ప్రమాణాలు పాటిస్తుందని , పని ప్రదేశంలో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగులకూ ఈ నియమం వర్తిస్తుందని విప్రో తన నిర్ణయాన్ని సమర్ధించుకుంది.

- Advertisement -

ఫ్రెషర్ల శిక్షణ కోసం ఒక్కొక్కరిపై వేసిన 75 వేల ఖర్చును సైతం తిరిగి చెల్లించాలని విప్రో కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ మొత్తాన్ని తీసుకోవడంలేదని కంపెనీ తెలిపింది. వేరే కంపెనీలకు పని చేస్తున్నారన్న కారణంతో గతంలోనూ విప్రో 300 మంది ఉద్యోగులను తొలగించింది. ఇటీవలే క్యూ3 ఆర్ధిక ఫలితాలు ప్రకటించిన విప్రో కొత్తగా ఈ త్రైమాసికంలో 600 మందికి తీసుకున్నట్లు తెలిపింది.

భవిష్యత్‌లోనూ నియామకాలు కొనసాగిస్తామని తెలిపింది. మరో చేర్చుకున్న ఫ్రెషర్లను తొలగించిన విప్రో, మరో వైపు ఆఫర్‌ లెటర్లు ఇచ్చినప్పటికీ ఉద్యోగులను చేర్చుకునే విషయలో తీవ్ర జాప్యం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. జాప్యం జరుగుతున్న మాట వాస్తవవేనని విప్రో అంగీకరించింది. ఆన్‌బోర్డింగ్‌ విషయంలో తమ హామీని నిలబెట్టుకుంటామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement