అత్తా, కోడళ్ళ మధ్య జరిగిన ఘర్షణ.. చిలికి చిలికి గాలివానలా మారింది. భార్యను మందలించినందుకు కొడుకు తన తల్లిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని వేంనూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… టమాటకూర బాగా వండలేదని కోడలిని అత్త మందలించడంతో కోడలు తన భర్తకు చెప్పింది.. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త.. నా భార్యను మందలిస్తావా.. తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -