Friday, October 4, 2024

Vijaya Dairy | పాడి రైతులకు రేప‌టిలోగా బ‌కాయిలు చెల్లిస్తాం..

విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతుల పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. మంగళవారం పాడి రైతులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లిస్తామని విజయ డెయిరీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పాల బిల్లుల చెల్లింపులో జాప్యం కార‌ణంగా పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి బాధలను అర్థం చేసుకున్న ప్రభుత్వం బిల్లులు చెల్లించేందుకు నిధులు మంజూరు చేసిందన్నారు.

బిల్లుల విషయంలో ఆందోళన చెందవద్దని పాడి రైతులు విజ్ఞప్తి చేశారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు విజయ డెయిరీ పాలను కొనుగోలు చేస్తోందని, బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. రూ.50 కోట్ల చెల్లింపు పూర్తి చేసి.. మిగిలిన బకాయిలను వీలైనంత త్వరగా చెల్లిస్తానని హామీ ఇచ్చారు.

అన్ని దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యి..

ఇక తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో తెలంగాణలోని అన్ని దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యినే సరఫరా చేయనున్నట్టు తెలంగాణ డెయిరీ డెలవప్‌మెంట్‌ సొసైటీ ఛైర్మన్‌ గుత్తా అమిత్‌ రెడ్డి వెల్లడించారు. ఇక నుంచి విజయ డెయిరీ పాల అమ్మకాలు మరింత పెంచడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టళ్లకు, పాఠశాలలకు, జైళ్లు, ఆస్పత్రులకు అవసరమైన పాలు, పాల పదార్థాలను సరఫరా చేయనున్నట్టు అమిత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement