Friday, April 26, 2024

లంకతో భారత్‌ ఢీ.. హార్థిక్‌ పాండ్యా సత్తా చాటేనా?

మంగళవారం జరగబోయే భారత్‌, శ్రీలంక టెస్ట్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి సీనియర్‌ ప్లేయర్లు లేకుండానే భారత జట్టు రంగంలో దిగనుంది. శ్రీలంకతో మూడుమ్యాచ్‌ల టీ 20 సిరీస్‌కు హార్థిక్‌ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా సంసిద్దమైంది. ముంబయిలో వాంఖడే వేదికగా మంగళవారం రాత్రి ఏడుగంటలకు జరగనున్న మ్యాచ్‌లో సత్తా చాటాలని టీమిండియా భావిస్తోంది. రోహిత్‌, విరాట్‌ లేకుండానే టీమిండియా పొట్టి ఫార్మెట్‌ లో సత్తా చాటాలని ఉవ్వీళూరుతోంది.


టీ 20 జట్టుకు పూర్తిస్థాయి సారథిగా బాధ్యతలు స్వీకరించిన హార్థిక్‌ పాండ్యా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. మిషన్‌ 2024 టార్గెట్‌గా భారత జట్టు సమాయత్తం అవుతోందని వచ్చే ఏడాది జరగనున్న టీ 20 ప్రపంచకప్‌ దిశగా పాండ్యా జట్టును సిద్దం చేయనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement