Saturday, April 20, 2024

బాల‌కృష్ణ వెబ్ సిరీస్ లో న‌టించ‌నున్నారా..!

హీరో బాల‌కృష్ణ వెబ్ సిరీస్ లో నటించ‌నున్నారా.. అన్ స్టాపబుల్ అంటూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చి మెప్పించారు. తొలి షోతోనే భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. దీంతో బాలయ్య ఏదైనా చేయగలరు అంటూ నమ్మకం వచ్చేసింది. ఇక ఆహాలో అన్ స్టాపబుల్ తో సక్సెస్ అవ్వడంతో ఈ టాక్ షో నిర్మాత అల్లు అరవింద్ బాలకృష్ణతో వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై బాలకృష్ణతో చర్చలు జరుపుతున్నారట. బాలయ్య బాబు దీనికి సై అంటే .. బాలయ్యలో మరో కోణం చూడబోతున్నారు అభిమానులు.

ఇప్పటికే సీనియర్ హీరోలు కూడా చాలామంది వెబ్ కంటెంట్ లోకి ఎంటర్ అవుతున్నారట‌. ప్రముఖ తారలంతా ఓటీటీ బాట పడుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలయ్య సరిసమానమైన హీరో వెంకటేష్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఎక్కాడు. రానా తో కలిసి రానా నాయుడు గా సందడి చేస్తున్నాడు. హీరోయిన్లలో స్టార్ హీరోయిన్లు కూడా ఓటీటీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్యను కూడా వెబ్ కంటెంట్ వైపు తీసుకురావాలి అని చూస్తున్నాడట అరవింద్. ఈక్రమంలో బాలకృష్ణ కనుక వెబ్ సిరీస్ చేస్తూ.. ఓటీటీ రేటింగ్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం అంటున్నారు సినీ పండితులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement