Thursday, April 18, 2024

పుతిన్‌ కాళ్లపై బ్లాంకెట్‌ ఎందుకు.? రష్యా అధ్యక్షుడి ఆరోగ్యంపై మరిన్ని అనుమానాలు..

మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోగ్యంపై మరోసారి సందేహాలు వ్యక్తమయ్యాయి. ఉదరసంబంధ క్యాన్సర్‌, పార్కిన్సన్‌ వ్యాధులతో ఆయన చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే ఆపరేషన్‌ చేయించుకుంటారని ఇటీవల రష్యాలో పేరుమోసిన టెలిగ్రామ్‌ చానల్‌ జనరల్‌ ఎస్‌వీఆర్‌ పేర్కొన్న నేపథ్యంలో తాజాగా మళ్లిd సందేహాలు వ్యక్తమయ్యాయి. రెండోప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి సంకేతంగా మాస్కో రెడ్‌స్క్వేర్‌లో రష్యా విజయోత్సవాలు నిర్వహించింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి పుతిన్‌ హాజరయ్యారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అప్పటి సైనికాధికారులు, ఉన్నతాధికారుల మధ్య కుర్చీలో ఆసీనుడైన పుతిన్‌ తన రెండుకాళ్లపై మందమైన ఆకుపచ్చని ఉన్ని బ్లాంకెట్‌ను కప్పుకున్నారు. దానిపై రెండు చేతులు పెట్టి ఎక్కువసేపు కదలకుండా కూర్చుకున్నారు.

ఒడిలో ఎందుకు బ్లాంకెట్‌ కప్పుకున్నారా అన్నది ఇప్పుడు అందరిలో తొలుస్తున్న సందేహం. ఆయన నడుస్తున్నప్పుడు ఓ పక్కకు ఒంగి, కుంటుతున్నట్లు పట్టిపట్టి నడవడం, కరచాలనం చేసినప్పుడు కూడా ఇబ్బంది పడటం వంటి లక్షణాలను గమనిస్తున్నవారు పుతిన్‌ ఆరోగ్యం బాగోలేదని భావిస్తున్నారు. విక్టరీ డేనాడు మాస్కోలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయని, అందువల్ల చలిని తట్టుకుని శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకే అలా బ్లాంకెట్‌ వాడారని క్రెవ్లిున్‌ వర్గాలు చెబుతున్నప్పటికీ ఆరోగ్య సమస్యలను దాచిపుచ్చుకునేందుకే అలా చేశారని ఎక్కువమంది విశ్వసిస్తున్నారు. గతనెలలో బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌తో భేటీ అయినప్పుడు, ఇటీవల రక్షణశాఖ మంత్రి సెర్జీ షోయగూతో సమావేశమైనప్పుడు ఆసాంతం టేబుల్‌ చివర కొనను పట్టుకునే ఉండటం వంటివి చూసినవారు పుతిన్‌ తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని విశ్వసిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement