Wednesday, April 17, 2024

బాక్సింగ్‌ డే టెస్టు.. అని ఎందుకు అంటారంటే..

క్రిస్మస్‌ తర్వాత రోజు డిసెంబర్‌ 26ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, కెనడాతోపాటు ఇతర కామన్వెల్త్‌ దేశాల్లో బాక్సింగ్‌ డేగా జరుపుకుంటారు. క్రిస్మస్‌ మరుసటి రోజు చర్చిల్లో బహుమతులుగా వచ్చిన బాక్స్‌లను తెరుస్తారు. క్రిస్మస్‌ రోజున పనిచేసిన సేవకులకు వాటిని బహుమతులుగా అందజేస్తారు. బాక్సింగ్‌ డే నాడే వాటిని పేదలకు బహుమతులుగా ఇస్తారు. ఇదే రోజున ఎన్నో క్రీడాకార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. భౌగోళిక రీత్యా కామన్వెల్త్‌ దేశాల్లో డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వేసవికాలం. కాగా ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 26న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ)లో బాక్సింగ్‌డే టెస్టు నిర్వహిస్తారు.

ఆస్ట్రేలియాలో పర్యటించే పర్యాటక దేశంతో డిసెంబర్‌ 26 నుంచి 30వరకు బాక్సింగ్‌ డే టెస్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్వహిస్తుంది. తొలి బాక్సింగ్‌ డే టెస్టు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య 1950లో జరిగింది. భారతజట్టు కూడా ఆస్ట్రేలియాతో 1985, 1991, 1999, 2003, 2007, 2011, 2014, 2018లో బాక్సింగ్‌ డే టెస్టు ఆడింది. చివరిసారిగా 2020లో కూడా భారత్‌-ఆస్ట్రేలియా టెస్టులో తలపడ్డాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లోనూ బాక్సింగ్‌ డే టెస్టులు జరుగుతాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య నేటినుంచి బాక్సింగ్‌ డే టెస్టు జరగనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement