Wednesday, March 29, 2023

దేశమంతా కేసీఆర్ కోసం ఎదురుచూస్తోంది : ప్రభుత్వ విప్ బాల్క సుమన్

భారతదేశమంతా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎదురుచూస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి సర్కార్ దుర్మార్గపు పాలన చేస్తుందని ఆరోపించారు. దేశంలోని రైతులను రాజులుగా మార్చడం ఒక కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందన్నారు. మోడీ రాక్షస పాలన చేస్తున్నారని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ముక్తుభారత్ ను కోరుకుంటున్నారన్నారు. దేశ ప్రజానికమంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ప్రధాని మోడీ పాలన ఏ వర్గానికి న్యాయం జరగలేదని, తెలంగాణ తరహా దేశమంతా అభివృద్ధి బాటలో పయనించాలంటే జాతీయ రాజకీయాల్లోకి రావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement