Wednesday, March 27, 2024

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరు?.. పోటీ పడుతున్న సిరాజ్, గిల్.

ఈ మధ్య కాలంలో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్. ఈ ఇద్దరూ గత జనవరి నెలలో అద్భుతంగా రాణించారు. దీంతో ఆ నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఈ ఇద్దరినీ మంగళవారం (ఫిబ్రవరి 7) ఐసీసీ నామినేట్ చేసింది. ఇక ఈ ఇద్దరితోపాటు న్యూజిలాండ్ బ్యాటర్ డెవోన్ కాన్వే కూడా ఈ అవార్డు కోసం పోటీ పడనున్నాడు. కొత్త ఏడాదిని కాన్వే అద్భుతంగా ప్రారంభించాడు. అతడు అన్ని ఫార్మాట్లలో కలిపి జనవరిలో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక ఇండియన్ ప్లేయర్ గిల్ విషయానికి వస్తే 2022లో తన టాప్ ఫామ్ ను కొత్త ఏడాది కూడా కొనసాగిస్తున్నాడు.

టెస్టులకే పరిమితమైన తన పర్ఫార్మెన్స్.. వన్డేలు, టీ20ల్లో కూడా కొనసాగింది. మొదట శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో అతడు 70, 21, 116 రన్స్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో హైదరాబాద్ లో జరిగిన తొలి వన్డేలోనే డబుల్ సెంచరీ చేశాడు. కేవలం 149 బాల్స్ లోనే 208 రన్స్ చేయడం విశేషం. అదే సిరీస్ లో తర్వాతి రెండు వన్డేల్లో 40, 112 స్కోర్లు చేశాడు. తర్వాత న్యూజిలాండ్ తో టీ20ల్లోనూ రెచ్చిపోయాడు. ఈ ఫార్మాట్ కు పనికి రాడన్న విమర్శలకు చెక్ పెడుతూ చివరి మ్యాచ్ లో మెరుపు సెంచరీ చేశాడు. మరోవైపు మహ్మద్ సిరాజ్ క్రమంగా ఇండియన్ టీమ్ లో ప్రధాన బౌలర్ గా ఎదుగుతున్నాడు. బుమ్రా లేని లోటును అతడు తీరుస్తున్నాడు. వన్డేల్లో ఇప్పటికే నంబర్ వన్ ర్యాంకు కూడా అందుకున్నాడు.

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో అతడు మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత తన హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్లు తీసుకున్నాడు. రెండో వన్డేలో ఆరు ఓవర్లు వేసి కేవలం 10 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement