Friday, October 11, 2024

మెడికల్‌ షాపులపై కొరడా.. డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారుల నిరంతర తనిఖీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాజధాని హైదరాబాద్‌ నగరంలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్‌ దుకాణాలపై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. నకిలీ మందుల అమ్మకాలపై నిరంతర దాడులు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెడికల్‌ షాపుల్లో నాసిరకం మందుల విక్రయాలతో పాటు అధిక ధరలకు మందులు విక్రయిస్తున్న వారిపై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు చర్యలు తీసుకున్నారు. అనుమతులు లేకుండా మందులు విక్రయిస్తున్న దుకాణాలపై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనుమతులు లేకుండా డ్రగ్స్‌ టాబ్లెట్స్‌ అమ్ముతున్న మెడికల్‌ షాప్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

నగరంలోని అనేక మెడికల్‌ షాప్‌లపై డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. యువతకు మెడికల్‌ షాప్‌ యజమానులు మత్తు టాబ్లెట్స్‌ అల్ఫాజూలు అమ్ముతున్నట్లు అనేక చోట్ల గుర్తించారు. మత్తు టాబ్లెట్స్‌కు అలవాటు పడ్డ యువకులు నేరాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. డబ్బుకు ఆశపడి మెడికల్‌ యజమానులు మొత్తం టాబ్లెట్స్‌ అమ్ముతున్నట్లు తెలిపారు. అక్రమంగా మందులు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పలు మెడికల్‌ షాపులపై అధికారులు దాడులు నిర్వహించి.. లైసెన్సులను రద్దు చేశారు.

- Advertisement -

లైసెన్సులను రద్దు చేసిన మెడికల్‌ షాపులు ఇవే..

  • కోఠి ఇందర్‌ బాగ్‌ లోని గణేష్‌ ఫా ర్మాస్యూటికల్స్‌, అంబర్‌ పేటలోని బయోస్పియర్‌ ఎంటర్పైజ్రెస్‌ అంబర్పేట్‌ లైసెన్స్‌ శాశ్వతంగా రద్దు చేసినట్లు వెల్లడించారు.
  • నాంపల్లిలో సర్దార్‌ మెడికల్‌ హాల్‌ 3 రోజులు సస్పెండ్‌ చేశారు.
  • అక్షయ మెడికల్‌, జనరల్‌ స్టోర్‌ లైసెన్స్‌ శాశ్వతంగా రద్దు చేసినట్లు వెల్లడించారు.
  • నాంపల్లిలోని హైదరాబాద్‌ మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ వారం రోజుల పాటు అమ్మకాలు నిలిపివేతకు ఆదేశాలు జారీ చేశారు.
  • లంగర్‌ హౌస్‌ ఆర్‌ఎస్‌ వైద్య సాధారణ దుకాణాలు రద్దు
  • చార్మినార్‌ లోని భారత్‌ మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ మూడు రోజుల సస్పెన్షన్‌.
  • హుమాయున్‌ నగర్‌ లో అల్హమ్రా మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్‌ 15రోజులు అమ్మకాలు నిలివేశారు.
  • ఉప్పల్లోని శ్రీ అయ్యప్ప మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌
  • గౌలిగూడలోని గోకుల్‌ మెడికల్‌ షాప్‌ రెండు రోజులు,
  • చార్మినార్‌లోని మీరా మెడికల్‌ షాపును వారంపాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement