Wednesday, December 1, 2021

ఐపీఎల్ సీజ‌న్ 15 ఎక్క‌డ జరుగుతుందంటే..

ప్ర‌భ‌న్యూస్: క్రికెట్‌ అభిమానులకు బీసీసీఐ సెక్రటరీ జైషా శుభవార్త చెప్పారు. ఐపీఎల్‌ 15వ సీజన్‌ భారత్‌లోనే జరుగుతందని స్పష్టం చేశారు. వచ్చే సీజన్‌లో మెగాలీగ్‌ స్వదేశంలోనే జరగటంతోపాటు రెండు కొత్త జట్లు అహ్మదాబాద్‌, లక్నోలు చేరడంతో ఐపీఎల్‌ మరింత రసవత్తరంగా జరుగుతుందన్నారు. చెపాక్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆడితే చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు వారి కోరిక త్వరలోనే తీరనుంది.

ఐపీఎల్‌ 2022 భారత్‌లోనే జరుగుతుంది. వచ్చే సీజన్‌ కోసం మెగా ఆక్షన్‌ జనవరిలో జరిగే అవకాశం ఉందని జైషా స్పష్టం చేశారు. ఐపీఎల్‌ 2021 ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయానికి ఆ జట్టు సీఈవో విశ్వనాథన్‌ కృషి కూడా ఉందని జైషా పేర్కొన్నారు. కెప్టెన్‌ ధోనీ సీఎస్కేకు అందించిన విజయాలు చిరస్మరణీయంగా ఉంటాయని జైషా అన్నారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News