Saturday, April 20, 2024

WhatsApp | వాట్సాప్​లో కొత్త అప్​డేట్స్​.. ఆపిల్​ ఐఫోన్ వాడేవారికి లేటెస్ట్​ వర్షన్​ అందుబాటులో

మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ కొత్త కొత్త అప్​డేట్స్​ని ఇస్తూనే ఉంది. ఈ మధ్య లేటెస్ట్​గా ఆపిల్​ ఐఫోన్లు వాడే వారికి సరికొత్త అప్​డేట్​ వచ్చినట్టు వాట్సాప్​ బీటా ఇన్​ఫోలో వెల్లడించింది. ఆపిల్​ ఫోన్లలో వాడే ప్రత్యేక iOSలో నిర్దిష్ట గ్రూప్ పార్టిసిపెంట్ కోసం త్వరగా, ఈజీగా యాక్షన్​ తీసుకోవడానికి గ్రూప్ అడ్మిన్‌ల కోసం కొన్ని కొత్త షార్ట్ కట్‌లను విడుదల చేసింది. ఈ కొత్త షార్ట్ కట్‌లు గ్రూపు సభ్యులతో పరస్పర చర్యలను మరింత ఈజీ చేయనున్నాయి. ఇప్పుడు ప్లాట్‌ఫారమ్ గరిష్టంగా 1024 మంది పాల్గొనే పెద్ద గ్రూపులకు సపోర్టు ఇస్తుందని WABetainfo ఈ వివరాలు వెల్లడించింది.

కొత్త అప్‌డేట్ ప్రకారం.. గ్రూప్ అడ్మిన్‌లు గ్రూపులను మేనేజ్ చేయడానికి, అంత పెద్ద సంఖ్యలో పాల్గొనే వ్యక్తులతో ప్రైవేట్‌గా కమ్యూనికేట్ చేయడానికి ఇది సహాయపడుతుంది. యాప్ స్టోర్ నుండి iOS కోసం WhatsAppకి చెందిన లేటెస్ట్​ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసే వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

కొత్త అప్‌డేట్‌తో గ్రూప్ పార్టిసిపెంట్‌లు గ్రూప్‌లో చేరినప్పుడు, గ్రూపు నుంచి అవుట్​ అయినప్పుడు గ్రూప్ ఈవెంట్‌లలో ఫోన్ నెంబర్‌లు హైలైట్ అవుతాయి. గ్రూప్ అడ్మిన్‌లు వారితో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వగలరు. అడ్మిన్‌లు ఫోన్ నెంబర్‌ను నొక్కి పట్టుకుని ఉంచినట్లయితే, వారు కొత్త షార్ట్ కట్‌లను ఉపయోగించవచ్చు. ఇందులో పాల్గొనేవారికి త్వరగా కాల్ చేయగల.. ప్రైవేట్‌గా చాట్ చేయగల ఫెసిలిటీ ఉంటుంది. వారు గ్రూప్ పార్టిసిపెంట్‌లను.. కాంటాక్ట్స్​ లిస్టులోకి కూడా ఈజీగా యాడ్​ చేసుకోవచ్చు. వారి ఫోన్ నెంబర్‌లను కాపీ చేయవచ్చు.

- Advertisement -

“ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లకు టైమ్​ సేవ్​ చేస్తుంది. ఎందుకంటే వారు ఇకపై సంప్రదింపు సమాచారాన్ని కనుగొనడానికి గ్రూప్ ఇన్ఫో స్క్రీన్ ద్వారా నావిగేట్ చేయవలసిన అవసరం లేదు” అని ఆ నివేదిక పేర్కొంది. కాగా, గత వారం మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ iOS బీటాలో కొత్త ‘వాయిస్ స్టేటస్ అప్‌డేట్స్’ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇది స్టేటస్ అప్‌డేట్‌ల ద్వారా వాయిస్ నోట్‌లను షేర్ చేయడానికి వినియోగదారులకు పర్మిషన్​ ఇస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement