Friday, March 29, 2024

భద్రత, గోప్యతను పెంచేందుకు.. 2022లో వాట్సాప్‌ కీలక చర్యలు

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ సర్వీస్‌లలో వాట్సప్‌ పరిశ్రమలో అగ్రగామి గా ఉంటూ 2022లో వినియోగదారుల గోప్యత, భద్రత కోసం పలు కీలకమైన ఫీచర్‌లను ప్రారంభించడం ద్వారా ఉత్పత్తి ఆవిష్కరణను మరింత ఉన్నతీకరించేందుకు శ్రమిస్తూ వస్తోంది. రక్షణ కవచాలతో నిర్మించిన వాట్సప్‌, సందేశాలు పంపిస్తున్నప్పుడు, వారి డిజిటల్‌ శ్రేయస్సును కాపాడుతూ వినియోగదారులకు వారి సంభాషణలపై గోప్యతను, నియంత్రణను అందిస్తుంది.

వాట్సప్‌ 2022లో ప్రారంభించిన టాప్‌ 6 భద్రత, గోప్యతా ఫీచర్లు ఇక్కడ ఉన్నాయి. అడ్మిన్‌ కంట్రోల్‌, వ్యూ ఒన్స్‌ మెసేజ్‌లను స్కీన్ర్‌షాట్‌ తీసుకోకుండా నిరోధించడం, లివ్‌ గ్రూప్‌ సైలెంట్లీ-, కంట్రోల్‌ యువర్‌ ఆన్‌ లైన్‌ ప్రెజెన్స్‌, ఫార్వర్డింగ్‌ సందేశాలపై వాట్సప్‌ పరిమితులు, కోడ్‌ వెరిఫై వంటి చర్యలను వాట్సప్‌ వినియోగదారుల కోసం చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement