Friday, March 29, 2024

వాట్స్‌యాప్‌ డేటా లీక్‌.. అమ్మకానికి 50 కోట్ల ఫోన్‌ నెంబర్లు

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్స్‌యాప్‌ నుంచి భారీగా డేటా లీక్‌ అయ్యింది. దాదాపు 50 కోట్ల మంది వాట్స్‌ యాప్‌ యూజర్ల ఫోన్‌ నెంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు తాజాగా సైబర్‌ న్యూస్‌ నివేదిక తెలిపింది. అమెరికా సహా పలు దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను హ్యాకర్లు అమ్మకానికి ఉంచినట్లు తెలిపింది. ఓ హ్యాకింగ్‌ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఈ ఫోన్‌ నెంబర్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన పెట్టినట్లు సైబర్‌ న్యూస్‌ కథనం తెలిపింది. 48.7 కోట్ల వాట్స్‌యాప్‌ యూజర్ల ఫోన్‌ నెంబర్లతో 2022 డేటా బేస్‌ను విక్రయిస్తున్నట్లు ఓ హ్యాకర్‌ ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చాడు.

అమెరికా, యూకే, ఈజిప్టు, ఇటలీ, సౌదీ అరేబియా సహా 8 దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను అమ్మకానికి పెట్టారని ఆ కథనం పేర్కొంది. ఇందులో మన దేశానికి చెందిన యూజర్ల నెంబర్లు కూడా ఉన్నాయి. అత్యధికంగా ఈజిప్టు నుంచి 4.5 కోట్ల మంది, ఇటలీ నుంచి 3.5 కోట్ల మంది అమెరికాకు చెందిన 3.2 కోట్ల మంది సౌదీ అరేబియా నుంచి 2.9 కోట్లు, ఫ్రాన్స్‌ నుంచి 2 కోట్లు, టర్కీకి చెందిన 2 కోట్ల మంది, యూకే కు చెందిన 1.1 కోట్ల మంది, రష్యా నుంచి కోటి మంది వాట్స్‌యాప్‌ యూజర్ల నంబర్లు లీకైనట్లు సైబర్‌ న్యూస్‌ పేర్కొంది. ఒక్కో దేశానికి చెందిన యూజర్ల నెంబర్లను ఒక్కో రేటుకు అమ్మకానికి పెట్టినట్లు తెలిపింది. అమెరికా డేటాకు 7 వేల డాలర్లు, యూకే డేటా ధరను 2,500 డాలర్లు, జర్మనీ యూజర్ల నెంబర్లకు 2 వేల డాలర్లుగా ఉంది.

ఈ నెంబర్లను సైబర్‌ నేరగాళ్లు కొనుగోలు చేసుకుని మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని సైబర్‌ న్యూస్‌ హెచ్చరంచింది. అందువల్ల గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్స్‌, మెసేజ్‌లు వస్తే స్పందించవద్దని సూచించింది. మెటాకు చెందిన సంస్థల నుంచి డేటా లీక్‌ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ 50 కోట్ల మందికి పైడా ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను హ్యాకర్లు చేతికి వెళ్లాయి. ఇవి ఆన్‌లైన్‌లో లీకైయినట్లు వార్తలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement