Thursday, April 25, 2024

సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్ట్ పై పిటీష‌న్… సుప్రీంకోర్టు నిర్ణ‌యం ఎంటి..

ప్ర‌భ‌న్యూస్ : కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంతో ప‌ర్యావ‌ర‌ణానికి తీవ్ర విఘాతం క‌ల్గుతుంద‌ని ప‌లువురు ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు సుప్రీంకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. నిర్మాణ కార్య‌క‌లాపాల‌తో తీవ్ర‌మైన వాతావ‌ర‌ణ కాలుష్యం ఏర్ప‌డుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది.

కాలుష్యాన్ని అరిక‌ట్టేందుకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ క‌మిష‌న్ జారీ చేసిన ఆదేశాల‌ను ఏమేర‌కు పాటిస్తున్నారో తెలియ‌జేయండి అంటూ కేంద్ర ప్ర‌భుత్వం, ఢిల్లీ స‌ర్కార్ల‌ను ఆదేశించింది. ఒక వేళ పాటించ‌లేక‌పోతే దానికి సంబంధించిన అఫిడ‌విట్‌లు రేప‌టిలోగా దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. కాలుష్యంపై ప‌ర్యావ‌ర‌ణ క‌మిటీ ఇచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌లు మంచివే కానీ ఫ‌లితం శూన్యం అంటూ ధ‌ర్యాస‌నం వ్యాఖ్యానించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement