Thursday, March 30, 2023

Opinion: ఎర్రకోట సందేశం ఏమిటి?

స్వతంత్ర భారతదేశానికి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కొన్ని రోజుల నుంచి అమృతోత్సవాలు, వజ్రోత్సవాల పేర్లతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. 76వ స్వాతంత్య్ర వేడుకలు రంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ సంబరాలు అంబరాన్ని తాకాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలలోనే కాకుండా ప్రతి ఇంటి మీద, ప్రతి దుకాణం మీద, ఇంకా నాలుగు చక్రాల వాహనాల మీద, ద్విచక్రవాహనాల మీద, ఆటోరిక్షాల మీద మువ్వన్నెల జెండాలు మురిసిపోయాయి. రాష్ట్రాల రాజధానులలో ముఖ్యమంత్రులు, దేశ రాజధాని ఢిల్లిలో ప్రధాని ఈ 15న ప్రత్యేక తరహాలో జెండాలు ఆవిష్కరించి భావోద్వేగం తో ప్రసంగించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కూడా తన దైన పంథాలో జెండాను ఆవిష్క రించి భారత రాజ్యాంగం ఔన్నత్యం గురించి వివరించారు.

అయితే… కొన్ని రోజులుగా ఈ సంబరాల కార్యక్రమాలలో మొత్తం అధికార యంత్రాంగం లీనం కావడంతో అనేక రకాల సమస్యలు పెండింగ్‌ లో పడ్డాయి. శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఎప్పటినుంచో మూలన పడ్డాయి. ఈ సంబరాలు జరుగుతున్న సమయంలోనే రాజస్థాన్‌ లో ఓ ఉపాధ్యాయుని చేతిలో ఒక దళిత విద్యార్థి మృతి చెందిన ఘటన యావత్‌ భారత మానవాళి మనసును గాయ పరిచిం ది. సరిగ్గా 15వ తేదీనే ఖమ్మం జిల్లాలో ఒక రాజకీయ నాయ కుడు ప్రత్యర్థి రాజకీయ నాయకుల చేత హత్య గావించ పడ్డాడు. హత్య చేసినవారు ఓ అభ్యుదయ, మార్కిస్ట్‌ పార్టీకి చెందినవారుగా ఆరోపణలు ఎదుర్కొంటుండటం చాలా బాధాకరం. ఇంకా అనేక ప్రాంతాలలో షరా మామూలే అనే విధంగా దాడులు, ప్రతిదాడులు, లైంగికదాడులు యథాత థంగా జరిగాయి. నాయకులు, అధికారులు ఇలా సంబరాల లో మునిగిపోగా, మరోవంక తెలుగు రాష్ట్రాలలో వదలని వరదలు సామాన్య జనాన్ని పట్టిపీడిస్తున్నాయి.

- Advertisement -
   

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఎర్రకోట ప్రసంగంలో నానాటికీ పెరిగిపోతున్న నల్లధనం, అవినీతి గురించి ప్రధానంగా ప్రస్తా వించారు. వీటిని అరికట్టే శక్తి ఆయన చేతుల్లోనే ఉంది. అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఏ విధంగా అయితే ఆయన ప్రసంగంలో ఈ అంశాలు దొర్లాయో, ఇప్పు డు కూడా అలాగే ప్రస్తావనకు రావడాన్ని బట్టి వీ టిని అరికట్టే శక్తి ఆయనకు లేదా అన్న అనుమానం సామాన్యులకు కలిగితే తప్పుపట్టలేం. ఆయన ఉద్దేశ్యం మంచిదే అయినా,అందుకు మంత్రివర్గం,అధికార యంత్రాంగం సహకరించడం లేదే మోనన్న అనుమానం కూడా కలుగుతోంది. దేశంలో ఇటీవ ల కాలంలో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆదాని, అంబానీల కు ఎవరి ఆశీస్సులతో స్థానం లభించిందో మోదీ సమాధానం చెప్పాలని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

అలాగే, దేశంలో పెరిగిపోతున్న అసహన ధోరణులను అరికట్టడంలో కేంద్రం విఫలమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్రమూ, రాష్ట్రాల మధ్య సమాఖ్య సంబంధాలు లుప్తమవుతున్నాయ న్న ఆరోపణలు వస్తూన్నాయి. కేంద్రంపై ప్రతి దానికీ రాష్ట్రా లు ఆధారపడే పరిస్థితి ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందన్న విమర్శలు వస్తున్నాయి. వీటిపై ప్రధానమంత్రి స్పందించి ఉంటే బాగుండేది. కేంద్రం నుంచి రావల్సిన నిధుల గురించి రాష్ట్రాలు ఇటీవల ఒకే తరహాలో డిమాండ్‌ చేస్తున్నాయి. నిధు ల పంపిణీపైకేంద్ర ప్రణాళికా సంఘం స్థానే ఏర్పడిన నీతి ఆయోగ్‌ తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడం లేదన్న విమర్శలూ వస్తున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాల్లో సమస్యల గురించి కేంద్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

కర్నాటకలో వున్న బీజేపీ ప్రభుత్వంలో ఒక మంత్రి అవినీతి వేదింపుల వల్ల ఓ కాంట్రాక్టర్‌ ఆత్మ#హత్య చేసుకున్న ఘటన ఇంకా కళ్ల ముందు మెదులుతూనే వుంది. ఆ మధ్య ఉత్తరప్రదేశ్‌లో రైతుల మీదికి ఓ కేంద్ర మంత్రి తనయుడు తన కారును ఢీ కొట్టించి వారి మరణాలకు కారకులైన విషయం గురించి నేటికీ చర్చ జరుగుతూనే వున్నది. కేంద్ర ప్రభుత్వ పెద్దల స#హకారంతోనే మహారాష్ట్రలో శివసేన సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలిన విషయం గురించి వేరే చెప్పవలసిన పని లేదు. బీజేపీ సంకీర్ణ కూటమి నుంచి బీహార్‌లో నితీశ్‌్‌ కుమార్‌ బయటికి వచ్చి మహాఘట్‌బంధన్‌ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసిన విషయం గురించి కూడా కేంద్ర ప్రభు త్వ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పాలు, కూరగాయలు తదితర వాటి మీద సామాన్యులు బెంబేలెత్తే విధంగా జీఎస్టీని విధించడం, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలెండర్ల ధరలు ప్రతి నెలా పెరుగుతూ మధ్య తరగతి కుటుంబీలు హాహాకారాలు చేస్తున్నవిషయాన్ని కూడా కేంద్ర పాలకులు గుర్తించాలి.

ఈ వేడుకల సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు దేశంలో ఇంకా ఇరవై కోట్ల మంది నిరుపేదలు వున్నారని గుర్తు చేశారు. ఉచిత పథకాల గురించి అన్ని రాజకీయ పార్టీల వైఫల్యం వుందని ఎత్తి చూపారు. తెలుగు రాష్ట్రాలలో అయితే, అవినీతి అన్ని రంగాలలో పాతుకుపోయి సంక్షేమ పథకాల జాతరతో, ఉచిత పథకాల సూరుతో ఆర్థిక సంక్షోభం పెను సంక్షోభంగా మారింది. పొంచి వున్న లావాలాంటి ఈ ప్రమాదాన్ని ఇక్కడి పాలకులు గమనించాలి. ఇలా… కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చిన్నా చితకా సమస్యల నుంచి పెద్ద స్థాయి సమస్యల వరకు నాటుకు పోయిన నేపథ్యంలో ఇకనైనా… పాలకులు సమస్యల పరిష్కారం గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి శ్రద్ధ చూపాలని ఈ సంబ రాల హోరు బయటపడి నిజమైన అభివృద్ధి సాధించినప్పుడే… స్వాతంత్య్ర వీరులకు మనం అర్పించే నివాళికి సార్థకత చేకూరు తుందనే విషయా న్ని గుర్తించాలి.

  • తిప్పినేని రామదాసప్పనాయుడు,
    చైర్మన్‌, ముద్ర అగ్రికల్చర్‌ అండ్‌ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ
Advertisement

తాజా వార్తలు

Advertisement