Thursday, April 18, 2024

అస‌లేం జ‌రుగుతోంది బిగ్‌బాస్‌

  • అట్లాంటి తొక్కలో రిలేషన్‌షిప్ వ‌ద్ద‌న్న యానీ మాస్ట‌ర్‌

బిగ్‌బాస్‌ ఇంట్లో ఆరోవారం ర‌చ్చ ర‌చ్చ అయ్యింది. నామినేషన్‌ ప్రక్రియలో మొదలైన లొల్లి.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ ఇంటి సభ్యుల మధ్య ఈ గొడ‌వ‌లు తెచ్చింది. టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు బ్లూ, రెడ్‌, ఎల్లో, గ్రీన్‌ అనే నాలుగు టీమ్‌లుగా విడిపోయారు. అందులో గ్రీన్‌ టీమ్‌ సభ్యులైన రవి, లోబో, శ్వేతలకు స్పెషల్‌ ఫవర్‌ లభించింది. దీంతో వారు మిగిలిన మూడు టీమ్‌లలో తమకు నచ్చిన టీమ్‌ సభ్యులు తయారు చేసిన బొమ్మలను స్వాధీనం చేసుకోవచ్చు..

ఈ స్పెషల్ ఆఫర్ ఇచ్చి బిగ్‌బాస్‌ ఇంట్లో పెద్ద గొడవ పెట్టించిన‌ట్టు తెలుస్తోంది. రవి టీమ్‌ సభ్యులు తమ స్పెషల్‌ పవర్‌ను ఉపయోగించి యానీ మాస్టర్‌ టీమ్‌ బొమ్మలను తీసుకున్నారు. దీంతో యానీ మాస్టర్‌ మరో ప్లాన్‌ చేసింది. శ్వేత దాచిపెట్టిన బొమ్మలను లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్వేత, యానీల‌ మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో బాగా హర్ట్‌ అయిన యానీ.. లాస్ట్‌ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. ఇట్లాంటి తొక్కలో రిలేషన్‌షిప్‌ నాకొద్దంటూ బయటకు వచ్చేసింది. దీంతో బెడ్‌పై పడుకొని శ్వెత కన్నీటిపర్యంతమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement