Tuesday, April 16, 2024

కౌలు కష్టాలు తీరేదెన్నడు.. ప్రభుత్వం గుర్తించేనా.?

ప్రభ న్యూస్ : వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తోన్న కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేకుండా పోయింది. అటు పెట్టుబడి సాయం, ఇటు రుణ మద్దతు, విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు, ప్రమాదాలు జరిగిప్పుడు బీమా సదుపాయాలు, పంట నష్టపోతే పరిహారం అందకపోగా, పంట అమ్ము కునేటప్పుడు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కౌలుదా రులను గుర్తించి, వారికి ఈ ప్రయోజనాలందేలా చూస్తే తప్ప వారు మనుగడ సాగించలేని పరిస్థితి నెలకొంది. 2010-11 సమయంలో అప్పటి ప్రభుత్వం కౌలు రైతులకు రుణ అర్హత గుర్తింపు కార్డులిచ్చింది. ఉమ్మడి జిల్లాలో 6,200 మందికి కార్డులు అందజేసి రూ.10 వేల చొప్పునరుణ సదుపాయం కల్పించారు. ఆతర్వాత ప్రభుత్వాల విధానాలు మారడంతో ఆపథకం అటకెక్కింది. వాస్తవంగా సాగులో ఉన్న కౌలు రైతులను కాపాడేందుకు ప్రభుత్వం ముందుకురావాలనే సూచనలు వస్తున్నాయి. ఆరేళ్లలో రెట్టింపైన కౌలు ధరలు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గత ఆరేళ్లలో కౌలు ధరలు రెట్టింపయ్యాయి. జిల్లాల్లో బోరుబావుల కింద పత్తి, వరి, కంది సాగుచేసే కౌలుదార్లు ఎకరాకు రూ.ఆరు వేల నుంచి రూ.10 వేల వరకు కౌలు చెల్లిస్తున్నారు.

వర్షాధా రంగా సాగయ్యే భూములకు ఎకరాకు రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకు కౌలు రేట్లు ఉన్నాయి. గత ఆరేళ్లతో పోల్చుకుంటే ఈ రేట్లు ఉమ్మడి జిల్లాలో రెట్టింపయ్యా యని కౌలుదారులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా సాగులో ఉన్న రైతుల్లో సగానికిపైగా కౌలుదారులే ఉన్నారు. సొంతంగా ఉన్న ఎకరం, రెండెకరాల భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న విధానం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది.

కనీస రక్షణ కరవు..

కౌలు రైతులకు కనీస రక్షణ కరువైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడం, బ్యాంకుల్లో రుణం ఇవ్వకపోవడంతో తీరని భారం మోయాల్సి వస్తోంది. పంటలు నష్టపోతే పెట్టుబడులు నష్టపోగా, అధికారికంగా ఎక్కడా గుర్తింపు లేకపోవడంతో పంట నష్ట పరిహారం కూడా దక్కని పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్త‌నాలు, ఇతర సాగు ప్రోత్సాహకాలు కూడా అందడం లేదు. ప్రమాదవ శాత్తు సాగు సందర్భంగా విద్యుత్‌ షాక్‌తో గానీ, లేక ఇతర ఏదైనా కారణాలతో చనిపోయినా గుర్తింపు లేకపోవడంతో కనీసం ఇన్సూరె న్స్‌ కూడా లభించని దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారు. పంట అమ్ముకునే సమయంలో సైతం పట్టాదారు పుస్తకాలు అవసరమైతే భూ యజమానులనే ఆశ్రయించాల్సి రావడం, వారు
ఇవ్వకపోతే పంటను దళారులకు అప్పగించాల్సి వస్తోంది. సాగులో ఉన్న రైతుల్లో సగభాగం కౌలు రైతులను గుర్తించి, వారికి రుణం, సాగులో అవసర మైన మద్దతు, సబ్సీడీలు, పంటలు నష్టపోయినప్పుడు పరిహారాలు అదేలా చూడాలని, ప్రమాదవశాత్తు చనిపోతే బీమా సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ వస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement